Ram Charan: క్లీంకార కేర్ టేకర్‌కు రామ్ చరణ్ అంత జీతం ఇస్తున్నారా..!!

331

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప జన్మించిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో తేలిపోతున్నారు. రామ్ చరణ్ కూతురుకు క్లీంకార అనే పేరు పెట్టారు.

ఈ చిన్నది పుట్టిన దగ్గర నుంచి మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అంటుంటారు. అయితే ఈ చిన్నారి ఫోటోను మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు.క్లీంకారను చూడాలని మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్, ఉపాసన కూతురుతో బయటకు వెళ్లినా కూడా ఆ చిన్నారి ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మెగాఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ ఈ చిన్నారి ముఖం కనిపించలేదు. ఉపాసన ఫోటోలను షేర్ చేసినా కూడా క్లీంకార ఫెస్ కనిపించకుండా లవ్ ఎమోజీలతో కవర్ చేసింది.

ఇదిలా ఉంటే క్లీంకారకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. క్లీంకార కోసం ఓ కేర్ టేకర్ ను పెట్టుకున్నారు రామ్ చరణ్ ఉపాసన. రామ్ చరణ్ వరుసగా లు చేస్తున్నారు. ఆయన తన లతో బిజీగా ఉన్నారు. అటు ఉపాసన కూడా అపోలో హాస్పటల్ బాధ్యతలతో బిజీగా ఉండటంతో.. క్లీంకార కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ ను ఏర్పాటు చేశారట..

ఆమె పేరు సావిత్రి.. ఈమె చాలా మంది సినీ సెలబ్రెటీల పిల్లాకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకుకు కూడా సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఇటీవలే ముంబై వెళ్లిన రామ్ చరణ్ దంపతులు సావిత్రిని కలవడానికే వెళ్లారని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు క్లీంకారను చుకుంటున్నందుకు సావిత్రికి ఏకంగా లక్షన్నర ఇస్తున్నారని తెలుస్తోంది. అలాగే కోట్ల రూపాయిలు వెచ్చించి క్లీంకార కోసం ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారట ఉపాసన. ఇప్పుడు ఇదే న్యూస్ డ్;ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top